Header Banner

ఘర్షణల చరిత్రకు గుడ్‌బై.. అమిత్ షా మాటలతో కలకలం! ఛత్తీస్‌గఢ్‌లో 33 మంది నక్సల్స్ లొంగుబాటు!

  Sat Apr 19, 2025 13:12        Others

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలైట్లను తుదముట్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం మరోమారు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం సుక్మా (Sukma) జిల్లాలో 33 మంది నక్సలైట్లు శుక్రవారంనాడు లొంగిపోయారు. వీరిలో 17 మంది (Naxals) నక్సల్స్‌పై రూ.49 లక్షల రివార్డు ఉంది. తాజాగా లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలతో సహా 22 మంది సీనియర్ పోలీసులు అధికారులు, సీఆర్‌పీఎఫ్ ముందు లొంగిపోయారు. ఆ తర్వాత మరో 11 మంది పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నారు.
మావోయిస్టు సిద్ధాంతాల భావజాలం, స్థానిక గిరిజనలపై జరిగిన దురాగతాలపై విసిగిపోయి లొంగిపోతున్నట్టు వీరంతా ప్రకటించారని సుక్మా సూపరింటెండెంట్ ఆఫో పోలీస్ కిరణ్ చవాన్ తెలిపారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'నియాద్ నెల్లనార్' (యువర్ గుడ్ విలేజ్) పథకానికి వీరంతా ఆకర్షితులైనట్టు చెప్పారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలటరీ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా, స్క్వాడ్ సభ్యురాలైన ఆయన భార్య ముచాకి జోగి ఉన్నారని తెలిపారు. వరిలో రూ.8 లక్షల అవార్డు ఉందన్నారు. మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుధి బుధ్రాలపై ఒక్కక్కరిపై రూ.5 లక్షల రివార్డు, మరో ఏడుగురిపై రూ.2 లక్షలు రివార్డు ఉందని తెలిపారు. లొంగిపోయిన మరికొందరికి భద్రతా బలగాలపై దాడుల్లో ప్రమేయం ఉందని చెప్పారు. కాగా, నక్సల్స్ లొంగుబాటులో జిల్లా పోలీసులు, జిల్లా రిజర్వ్డ్ గార్డులు, సీఆర్‌పీఎఫ్, దాని అనుబంధ విభాగం కోబ్రా కీలక పాత్ర వహించారు.

ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NaxalSurrender #AmitShahWarning #Chhattisgarh #NaxaliteIssue #PeaceProcess #IndiaSecurity